అమెరికాలో మిస్టరీగా మారిన తెలుగు టెకీ మృతి     2018-06-23   01:25:05  IST  Bhanu C

అమెరికాలో ని షికాగోలో మరణించిన తెలుగు ఎన్నారై టెకీ మృతి సంచలనం సృష్టించింది..ఈ మృతి ఎంతో అనుమానాస్పదం గా మారింది..కేసుని నమోదు చేసుకున్నఅమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే టెకీ మృతి పట్ల ఆయన కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు..వివరాలలోకి వెళ్తే..

షికాగోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌ వాసి అంబారిపేట కృష్ణప్రసాద్‌ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు…అక్కడి స్థానిక పోలీసులు ఈ వివరాలని అతడి తండ్రి రాంప్రసాద్ కి తెలిపారు..రామంతాపూర్‌ శాంతినగర్‌కు చెందిన కృష్ణప్రసాద్‌ ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. షికాగోలోని హంటర్‌డ్రైవ్‌ అపార్ట్‌మెంట్‌–2ఏలో ఉంటూ విటెక్‌ కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు..