చికాగో టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌.. స్టార్స్‌ వణికి పోతున్నారు     2018-06-26   00:44:12  IST  Raghu V

తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచారం గుట్టు రట్టు అవ్వడం పలు సార్లు చూశాం. అయితే అమెరికాలో తెలుగు వారు చేస్తున్న వ్యభిచారం ప్రస్తుతం సంచలనంకు తెర తీస్తుంది. అమెరికాలో కిషన్‌ అనే వ్యక్తి తెలుగు హీరోయిన్స్‌ మరియు సెలబ్రెటీలతో అక్కడ వ్యభిచారం చేయిస్తూ కోట్లు దండుకుంటున్నాడు. రెండు నెలల క్రితం ఈ విషయం అమెరికా పోలీసులకు తెలిసింది. దాంతో వారు మొదట రహస్యంగా ఎంక్వౌరీ చేసి, ఆ తర్వాత వారు నిజంగానే సెక్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు అంటూ నిర్ధారణకు వచ్చి, బాహాటంగానే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్‌తో పాటు పలు తెలుగు సంఘాల వారిని ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులు తెలుగు హీరోయిన్స్‌ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు దక్కించుకున్న పలువురు అమెరికా సెక్స్‌ రాకెట్‌తో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల పేర్లపై వారు అక్కడకు వెళ్లడం వారం నుండి నెల రోజుల వరకు అక్కడ వ్యభిచారం చేయడం వంటివి చేస్తున్నారు అంటూ విచారణలో వెళ్లడైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సెలబ్రెటీలు మరియు తెలుగు సినిమా పరిశ్రమ మరియు బుల్లి తెరపై ఫేమస్‌ అయిన వారు సెక్స్‌ రాకెట్‌ బాధితులు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి.