Telangana TDP seniors try to jump into TRS

ఇప్పుడు అక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేక ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉంది టిడిపి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీని నడిపించే నాయకులు అసలు మచ్చుకు కూడా కనపడటం లేదు. టిడిపికి పెద్ద దిక్కుగా ఉన్న నేతలు అందరు సైకిల్ ఎక్కేస్తుంటే..అనుచరులు కార్యకర్తలు కూడా వారి వెంట వెళ్ళిపోతున్నారు.

జిల్లాలో ప్రస్తుతానికి ఇద్దరు సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ మాత్రమే టీడీపీలో ఉంటున్నట్టుగా ఉన్నారు కానీ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా పని చేయట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండవతో పాటు అన్నపూర్ణమ్మకి ఉమ్మడి జిల్లాలో పార్టీపై గట్టి పట్టుంది. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కూడా సైకిల్ వదిలి కారు ఎక్కడానికి సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది.. ఇదే కనుక జరిగితే టిడిపి పార్టీ తెలంగాణలో కనుమరుగు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.