Telangana launches T-wallet for all digital payments, sc

PayTM, Mobikwick, Freecharge, Rupay, .. ఇలా కొన్ని పదుల సంఖ్యలో మొబైల్ వాలెట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మనం మన రోజువారి ఖర్చులకి చెల్లింపులు చేస్తున్నాం. కరెన్సీ నోట్ల కరువులో కూరగాయలు, పెట్రోల్, బట్టలు, కరెంట్ బిల్, డిష్ బిల్, బస్ టికెట్స్, సినిమా టికెట్స్, చివరకి విమాన ప్రయాణం యొక్క టికెట్ ఖర్చులకి కూడా ఈ మొబైల్ వాలెట్స్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నాం.అయితే ఇవన్ని ప్రైవేటు యాప్స్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి కరెంట్ బిల్ చెల్లింపులు ఆలస్యంగా జరగోచ్చు. ఒక్కోసారి డబ్బులు కట్ అయిన సర్వీసులు మన దాకా అందకపోవచ్చు. కంప్లయింట్ ఇవ్వడం, వారికి మాటిమాటికి ఫోన్లు చేయడం .. ఇదో పెద్ద తలనొప్పి.

అందుకే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఒక గవర్నమెంటు యాప్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు మీ రోజువారి ఖర్చులు వేల్లదీయవచ్చు. అంతమాత్రమే కాదు, విద్యార్థుల స్కాలర్ షిప్, ప్రభుత్వం అందించే సబ్సీడీలు .. పెన్షన్, అన్ని ఈ యాప్ ద్వారానే పొందవచ్చు.

ఈ యాప్ పేరే T-Wallet . దీని ద్వారా మీరు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. ఆధార్ + బయోమెట్రిక్ లేదా ఆధార్ + వన్ టైం పాస్వర్డ్ ( ఆధర్ లింక్డ్) ద్వారా మీరు ఈ యాప్ లో మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీ ఆధార్ వివరాలు ఇవ్వనిదే దీని వాడుకోలేరు. దీని మీరు ఇటు మొబైల్ లో, అటు కంప్యూటర్ లో, చివరకి ఇంటర్నెట్ లేకుండా కూడా వాడుకునే అవకాశం కల్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ యాప్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

మీ సేవ కేంద్రాలు రాష్ట్రంలో 4000 కి పైగా ఉన్నాయి. అక్కడే ఫోన్ లేకుండా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించనున్నారు. అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులు యాప్ ద్వారా చేయవచ్చు. ప్రస్తుతానికి KYC యూజర్లకి నెలకి 1,00,000 లిమిట్ గా పెడితే, Non – KYS యూజర్లకి 20,000 లిమిట్ గా పెట్టారు. పూర్తీ వివరాలు త్వరలోనే కేటిఆర్ ప్రకటిస్తారు.