Telangana govt summons 10 Tollywood celebs for drug usage

టాలివుడ్ కి డ్రగ్ మాఫియాకి నిజంగానే సంబంధాలు ఉన్నాయి. రేవ్ పార్టీలు చూడాలంటే ఎక్కడో ముంబై లేదా గోవా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. అక్కడ డ్రగ్ బానిసలకి కొదువ ఉండదు. మరి ఈ నగ్న నృత్యాలు, డ్రాగ్ డోసేజ్ నిండిన పార్టీలు బడా బాబులే కదా ఆర్గనైజ్ చేయాల్సింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వారు ఉన్నారండి ఈ పార్టీలు ఆర్గనైజ్ చేయడానికి. అంతలా డెవలప్ అయిపొయింది హైదరాబాద్. అందుకే తెలంగాణా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పదిమంది తెలుగు సినిమా వారికి సమన్లు జారి చేసారు. ఆరు రోజుల్లో వీరు తమ సమాధానం చెప్పాలి. ఈ పదిమంది డ్రగ్స్ కి బానిసైనవారే. అందులో ముగ్గురు యువహీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక ఫైట్ మాస్టర్ ఉన్నారు.

ఇవన్ని పుకార్లేమో అనుకోకండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నోటీసులు విడుదల చేసాక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారు సమావేశమయ్యారు. టాలివుడ్ కి డ్రగ్ మాఫియాకి సంబంధాలు ఉన్నాయని స్వయంగా అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి సినీపెద్దలు ఒప్పుకున్నారు. ఆ పదిమందికి వార్నింగ్ ఇచ్చారు ప్రెస్ మీట్ లో. ఇండస్ట్రీలో 99% మంది బాగానే ఉంటున్నా, ఆ 1% మంది వలనే ఇటు ఇండస్ట్రీకి, అటు హైదరాబాద్ నగరానికి చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా డ్రగ్స్ కి బానిస అవోద్దని, రేవ్ పార్టి కల్చర్ ని ఎంకరేజ్ చేయొద్దని విజ్ఞప్తి చేసారు.

ఇప్పుడు అందరి డౌటు ఒక్కటే. ఆ పదిమంది ఎవరు? వారి పేర్లు ఇంకా బయటకి ఎందుకు రాలేదు. ఆ ముగ్గురు కుర్ర హీరోలు ఎవరు ? హీరోలకంటే ఎక్కువ రెచ్చిపోతున్న ఆ నలుగురు దర్శకులు ఎవరు ? ఇంకా కుర్రతనంలోనే ఉన్నామని అనుకుంటున్న ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు ? డ్రగ్స్ వాడుతూ ఫైట్ మాస్టర్ గా మ్యానేజ్ చేస్తున్న ఆ టెక్నిషియన్ ఎవరు ?