Minister KTR earns 7.5 lakh by selling Ice Cream

మీరు విన్నది నిజమే. తెలంగాణ ఐటి మినిస్టర్ కల్వకుంట్ల రామరావు ఐస్ క్రీమ్ అమ్మారు. ఇక్కడే, హైదరాబాద్ లోనే అమ్మారు. ఏదో ఓనర్ గా కూర్చోని అమ్మించారు అనుకోకండి, కూలిలాగే తానే స్వయంగా ఐస్ క్రీమ్ అమ్మారు. కాని మామూలుగా ఐస్ క్రిమ్ అమ్మేవారు రోజుకి వేలలో సంపాదిస్తోంటే, కేటిఅర్ మాత్రం లక్షలు సంపాదించారు. ఒక్కరోజులోనే 7.5 లక్షలు సంపాదించారు. ఆయన అనుకుంటే ఏడున్నర లక్షలు ఒక్క పూటలో ఖర్చుపెట్టగలరు కదా, మరి అంత చిన్న ఎమౌంట్ కోసం ఐస్ క్రీమ్ అమ్మాల్సిన పని ఏంటి అనే కదా మీ డౌటు.

ఏప్రిల్ 27వ తేదినా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ జరిగబోతోంది. సరిగ్గా అదే రోజు, 2001వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు కేటిఆర్. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభ కోసమే కేటిఆర్ చందాలు కలెక్ట్ చేసారు. నిన్న కాసేపు ఐస్ క్రిమ్ అమ్ముతూ నగరంలో కాసేపు సందడి చేసారు.

ఎంపి మల్లారెడ్డి ఏకంగా 5 లక్షలకు ఐస్ క్రిమ్ కొన్నారు. మరో టీఆర్ఎస్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి ఒక లక్ష చెల్లించి ఐస్ క్రీమ్ తీసుకుంటే, జ్యూస్ సెంటర్లో పార్టీ లీడర్ల నుంచి మరో లక్షన్నర సంపాదించారు కేటిఆర్. ఇలా 7.5 లక్షలకి పైగా ఒక్కరోజులో వసూలు చేసారు. నిన్న మొదలు ఏప్రిల్ 20 తారీఖు వరకు రోజూ టీఅర్ఎస్ లీడర్లు ఇలానే ఏదో ఒక పనిచేస్తూ చందాలు వసూలు చేస్తారు. కేసిఆర్ ఈ విషయం మీద పార్టీ లీడర్లందరికి ఆదేశాలు జారి చేసారు. వచ్చిన మొత్తాన్ని ఏప్రిల్ 21న కొంపల్లీలో జరగనున్న ప్లీనరీ సమావేశానికి, ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకి ఉపయోగిస్తారు. కార్యకర్తల ప్రయాణ ఖర్చులు, తిండి ఖర్చులు, మీటింగ్ ఖర్చులు .. అన్నీ ఈ చందాలతోనే వెళ్ళదీస్తారట. బాగుంది కదా ఈ ఐడియా.