తేజ తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనంటా..!     2018-04-26   04:17:17  IST  Raghu V

నందమూరి అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నందమూరి తారకరామారావు బయోపిక్‌ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎన్టీఆర్‌ చిత్రానికి ఎంతో మంది దర్శకులను పరిశీలించి చివరకు తేజకు ఆ బాధ్యతలను బాలయ్య అప్పగించడం జరిగింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి పొలిటికల్‌ డ్రామాను ప్రేక్షకుల ముందు ఉంచిన దర్శకుడు తేజ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకు న్యాయం చేస్తాడని బాలకృష్ణ భావించాడు. తేజ కూడా వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకునేందుకు ఇతర ప్రాజెక్ట్‌లను కూడా పక్కకు పెట్టాడు.

ఇటీవలే సినిమా ప్రారంభోత్సవం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరిగిన విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ తేజ ఆ వేదిక మీద ప్రకటించాడు. దాంతో అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో దర్శకుడు తేజ సంచలనాత్మకంగా తాను ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఎన్టీఆర్‌ అంటే తనకు అభిమానం అని, ఆయన చరిత్రను తాను చూపించేంత సమర్ధుడిని కాదు అంటూ చేతులు ఎత్తేశాడు. దాంతో ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.