నోరు లెగుస్తోందా ..? కేసులతో మూసేద్దాం ! టీడీపీ టార్గెట్ వారేనా ..?     2018-06-05   03:54:42  IST  Bhanu C

మాట మాట్లాడితే చాలు .. చంద్రబాబు.. టీడీపీ టార్గెట్ గా వారు మాటల తూటాలు పేల్చుతుంటారు. అవినీతి ఆరోపణలు గుప్పిస్తారు. కోర్టులలో కేసులు వేసి గుక్క తిప్పుకోకుండా చేస్తుంటారు. ఏదైనా కొత్త పధకం ప్రవేశపెడితే దానిలో లొసుగులు వెతుకుతారు. ఇలా ఏదో ఒక వంకతో పార్టీని , ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న కొంతమంది వైసీపీ ఎమ్యెల్యేలు చంద్రబాబు ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారారు. వీరి కారణంగా ప్రభుత్వం పరువు పోవడమే కాకుండా మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే వారి తాట తీసి వారిని కేసుల్లో ఇరికించాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది అందుకు తగ్గట్టుగానే వారిమీద కేసులు పెడుతూ వారి నోరు మూయించే పనిలోపడింది ప్రభుత్వం.

ప్రభుత్వాన్ని.. ముఖ్యంగా చంద్రబాబు ని బాగా ఇబ్బంది పెడుతున్న వైసిపి ఎమ్యెల్యేల్లో మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగిరి నుంచి రోజా, గుడివాడ నుండి కొడాలి నాని, నెల్లూరు రూరల్ నుండి అనిల్ కుమార్ యాదవ్, నరసరావుపేట నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అందుకే వీరందరిని ప్రభుత్వం బాగా టార్గెట్ చేసింది. ముందుగా శ్రీధర్ రెడ్డిని క్రికెట్ బుకింగ్ కేసులో ఇరికించారు. బుక్కీలతో సంబంధాలున్నాయని, క్రికెట్ బెట్టింగ్ లో కోటంరెడ్డి ఇన్వాల్వ్ అయ్యారంటూ కేసులు నమోదు చేశారు.