నీకు దమ్ముందా..జగన్ కి టీడీపీ ఎమ్మెల్యే సవాల్    2018-04-09   06:23:01  IST  Bhanu C

ఏపీ టీడీపి ఎంపీలు పుట్టిస్తున్న నిరసన సెగలు ఢిల్లీలో హీట్ ని మరింత పెంచుతున్నాయి..విభజన హామీలు అమలుకు ప్రత్యేక హోదా సాధనకి ఢిల్లీ లో టిడిపి ఎంపీలు చేస్తున్న దీక్షకి నిరసనలకి అనూహ్య స్పందన వస్తోంది…ఈ ఆందోళనకి మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు… హోదా సాధనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధాని మోదీ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు అయితే ఈ విషయం తెలిసిన క్రేజీ వాల్ స్టేషన్ కి వెళ్లి మరీ ఎంపీలని పరామర్శించారు..

ప్రధానిని కలవాలని వెళ్ళడం తప్పా అని ప్రశ్నించారు.. ఎంపీలకి కనీసం గౌరవం కూడా ఇవ్వలేరా అంటూ మండిపడ్డారు..


ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.. ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు..నిరసనలు తెలియచేయడం వారికి ఉన్న హక్కు వారిని అవమానించడం ఏపీ ప్రజలని అవమానించడమే అంటూ మండిపడ్డారు..ఇదిలాఉంటే టీడీపి ఎంపీల దీక్షపై జగన్ మోహన్ రెడ్డి హాస్యాస్పదంగా స్పందిచారు..దొంగ దీక్షలు అంటూ కామెంట్స్ చేశారు దాంతో ఒక్కసారిగా టిడిపి నేతలు జగన్ పై ఫైర్ అవుతున్నారు..

ఢిల్లీ లో టిడిపి ఎంపీలు చేస్తున్న నిరసనలని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్య బద్దంగా లేదు అంటూ గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు,ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు..ఒక పక్క ఏపీ కి దక్కవలసిన ప్రయోజనాల కోసం చంద్రబాబు ,ఎంపీలు ఎంతో కృషి చేస్తుంటే జగన్ కారు కూతలు కూస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు..2019 ఎన్నికల్లో మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు…అలాగే ప్రజల సొమ్మును దోచుకున్న జగన్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని మోడీ పేరు చెప్తేనే జగన్ వణికి పోతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు..ఈ క్రమంలోనే జగన్ కి జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు…దమ్ముంటే మోడీ ఇంటిముందు జగన్ ధర్నా చేయాలని ఆంజనేయులు జగన్ కి సవాల్ విసిరారు..