గుంటూరు “టీడీపీకి షాక్”.వైసీపీలోకి “కీలక నేత”..     2018-03-31   22:36:01  IST  Bhanu C

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలైన సమయంలో ఆ పాదయాత్రకి మైలేజ్ పెరగకుండా ఉండేందుకు వైసీపి నుంచీ టిడిపి లోకి ఎమ్మెల్యేలు..వైసీపి బడా నేతలు వచ్చి చేరేలా చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తులకి కొన్ని భాద్యతలు అప్పగించారు..అప్పట్లో జగన్ అడుగు తీసి అడుగు వేస్తూ తన యాత్ర జిల్లాలో దాటే లోపు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో నేత వైసీపిని వీడి సైకిల్ ఎక్కేసే వారు..దాంతో ఒక్కసారిగా జగన్ పాదయాత్రకి కొంత డ్యామేజ్ ఏర్పడినా సరే ఇలా చేయడం ఎంతవరకూ సమంజసం..ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది అనేలా సామాన్య ప్రజలకి సందేహం..చిరాకు కలిగేలా టిడిపి ప్రభుత్వం వలసలని ప్రోశ్చహించింది అయితే..తరువాత టిడిపిలో చేరే వారు లేక పోవడం మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అనే విధంగా చంద్రబాబు వలసలకి పులిస్టాప్ పెట్టారు..

ఇదిలాఉంటే జగన్ పాదయాత్ర కి భారీగా జనాలు రావడం రోజు రోజుకి జగన్ కి ప్రజాదరణ పెరగడం చుసిన వైసీపి నేతలు..ముఖ్యంగా జంపింగ్ నేతలు భవిష్యత్తులో జగన్ తో కలిసిఉంటేనే మంచిదని భావించారు..అయితే జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజు నుంచీ కూడా ఎక్కువగా గుంటూరు జిల్లా పాదయాత్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు..గుంటూరు లో యాత్ర ఆరంభం అయినప్పటి నుంచీ యాత్ర ముగిసే వరకూ కూడా టిడిపిలో ఎవరు కీలకంగా ఉన్నారో వారు వైసీపిలోకి వచ్చేలా వ్యూహాలు రచించారు..ఆ భాద్యతని పార్టీలోని కీలక నేతలకి అప్పగించారు..అయితే ఈ సమయంలోనే గుంటూరు జిల్లా టిడిపి కీలక నేత ఒకరు జగన్ పార్టీ లోకి జంప్ చేయడానికి సర్వం సిద్దం చేసుకున్నారని టాక్..