దాచేపల్లి లో మరొక ఘోరం..బాలికపై ఎంపీటీసీ భర్త అత్యాచారం..     2018-05-12   06:03:04  IST  Raghu V

రోజు రోజు కి మానవీయ విలువలు తగ్గిపోతున్నాయి..ఆడపిల్లల్ని పంజరాలలో పెట్టి పెంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. బయటకి పంపాలన్నా భయమే..ఇంట్లో వంటరిగా వదిలి వెళ్ళాలన్నా భయమే..చిన్న చిన్న పిల్లలని సైతం తమ కోరికలని తీర్చుకోవడానికి వాడుకుంటున్నారంటే అంతకు మించి దారుణం మరొకటి ఉండదు..అయితే కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా దాచేపల్లి లో చిన్నారి పై ఒక వృద్ధుడు చేసిన అత్యాచార ఘటన ఎవరూ మర్చి పోరు..

అయితే ఆ సంఘటనకి బలై పోయిన బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతుంది..చేసిన తప్పుకు ఆ దుర్మార్గుడు ఆత్మహత్య చేసుకున్నాడు…ఇదిలా ఉంటే ఆ సంఘటన జరిగిన రెండు రోజులకి ఏపీలో మరొక సంఘటన చోటు చేసుకుంది అది కూడా గుంటూరు జిల్లాలోనే అయితే తొమ్మిదేళ్ళ బాలికపై 21 ఏళ్ల కుర్రాడు అత్యాచారం చేశాడు..ఆ సంఘటనతో మరో మారు గుంటూరు జిల్లా మారుమోగి పోయింది.ఇదిలాఉంటే ఇప్పుడు మరొక చోటు చేసుకుంది..