తెలుగుదేశం-జనసేనల పొత్తు - సీట్ల డీల్ ఇదే  

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనే క్లారిటీ ఎవ్వరికీ లేదు..ఏ పార్టీ ఎవరికీ సపోర్ట్ చేస్తుంది,ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడు ఇలా అంతా గందరగోళంగా తయారయ్యాయి ఏపీ రాజకీయాలు.గత ఎన్నికలతో పోలిస్తే 2019 హై టెన్షన్ తీసుకువస్తున్నాయి.. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయనే విష‌యంపై స్ప‌ష్ట‌త లేక‌పోయినా.. ఏపీలో పొత్తుల గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా యి. గ‌త ఎన్నిక‌ల్లో ద్విముఖ పోటీ జరిగినా.. ఈసారి మాత్రం త్రిముఖ పోటీ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది! టీడీపీ, వైసీపీకి తోడు జ‌న‌సేన కూడా బ‌రిలోకి దిగుతుంద‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టంచేశారు.అయితే టిడీపి ని జనసేన ని వేరు వేరు గా ఎవ్వరు చూడటం లేదు..రెండు పార్టీలో ఒక్కటే..పవన్ అప్పట్లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చేలా చేశాడు..ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తూ తెలుగుదేశాన్ని ఈసారి కూడా అధికారంలో కూర్చోపెట్టాలనేది పవన్ బాబుల ప్లాన్ గా తెలుస్తోంది.

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి..సీట్ల విషయంలో టిడీపి అధినేత చంద్రాబాబు ఇప్పటికే జనసేన విషయంలో ఒక క్లారిటీ లో ఉన్నారట..సుమారు 35 నుంచి 45 వరకు ఇవ్వాలనేది బాబు మనోగతం. టీడీపీ అధినేత చంద్ర‌బాబు- జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్దరు ఎంత క్లోజ్ అనేది వేరే చెప్పవలసిన అవసరం లేదు రాజకీయ అవసరాల దృష్ట్యా పవన్ లేవనెత్తే ఎటువంటి పని అయినా సరే బాబు వెనువెంటనే ఆదేశాలతో వాటిని పూర్తీ చేయిస్తారు.. ఈవిషయం ఏపీలో ఉండే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు..ఇది రాజాకీయ ఎత్తుగడ అని.. పార్టీ నేత‌లు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసినా..ఆ విమర్శలని ఖండిస్తూ..విమర్శలు చేసిన వారికి తలంటే కార్యక్రమం బాబు ఈ మధ్యన చాలానే చేశారు. ఈ విషయాలు చాలు వారి ఇరువురి మధ్య భందం ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది.