ఆ వైసీపీ ఎంపీని చూసి టీడీపీ భయపడుతోందా ..?    2018-06-14   03:29:13  IST 

చంద్రబాబు కి ఇప్పుడు కంటి మీద కునుకు పాడడం లేదు. మొన్నటివరకు టీడీపీ కి వైసీపీ అధినేత జగన్ చుక్కలు చూపించేవాడు. అసెంబ్లీలోనూ .. బయట ప్రబుతువాన్ని ఇరుకున పెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయన పాదయాత్ర పేరుతో జనాల్లో తిరుగుతుండడంతో సాధారణ విమర్శలే చేస్తున్నాడు తప్ప ఇదివరకు అంతటి తీవ్రత అయితే లేదు. ఇప్పుడు ఆ లోటును ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీసుకున్నాడు. టెక్నీకల్ గా చంద్రబాబు ను ఇరుకునపెట్టడంలో విజయసాయి రెడ్డి సమర్ధవంతంమైన పాత్ర పోషిస్తున్నాడు.

టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలకు టీటీడీ ఉపక్రమించింది. వాళ్లు చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ ఇద్దరికి నోటీసులు జారీచేసింది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దీన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. తనకు ఇంత వరకు టీటీడీ నోటీసులు అందలేదని.. ఆ విషయం టీవీలో చూసి తెలుసుకున్నట్టు చెప్పారు. నోటీసుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. తనకు నోటీసులిచ్చే అధికారం మీకెవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.