ఆ పచ్చబొట్టు అతడి కాపురం కూల్చేసింది..గుడి అని చూడకుండా  

సాధారణంగా పెళ్ళికి ముందు కొంతమంది ఎవరినో ఒకరిని ఇష్టపడి ఉండచ్చు ఆ సమయంలో వారికోసం ఎన్నో సాహసాలు చేసి ఉండచ్చు ఎన్నో ఫీట్లు చేసి కూడా ఉండచ్చు అయితే వారి గుర్తులని ప్రేమించిన వ్యక్తి ఎంతో భద్రంగా ఉంచుకుంటారు..వారితో పెళ్లి అయితే సరేసరి లేదంటే వారిని మర్చిపోలేకో వేరే ఏదైనా కారణంగా వారి గుర్తులు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా గుండెలపై పచ్చ బొట్లు పొడిపించుకోవటం లేదంటే చేతిపై పచ్చ బొట్టు వేయించుకుంటారు..

అయితే తమిళ నాడుకి చెందిన ఒక యువకుడు కూడా తన ప్రేయసిని మర్చిపోలేక పోవడం వలన ఆమె గుర్తుగా ఆమె పేరుని పచ్చ బొట్టుగా చేతిపై ఉంచుకున్నాడు..ఇక్కడి వరకూ బాగానే ఉంది అయితే ఈ మధ్యనే అతగాడికి పెళ్లి అయ్యింది..పెళ్లి అయిన ఐదో రోజున అతడు తన భార్యని తీసుకుని గుడికి తీసుకుని వెళ్ళాడు..గుడికి వెళ్ళిన ఆ కొత్త జంట గుడి మెట్ల మీద కూర్చుని ఊసులు చెప్పుకుంటూ ఉండగా ఆ యువకుడి చేతిపై ఓ యువతి పేరు తో ఉన్న పచ్చబోట్టుని చూసిన భార్య తన భర్తని నిలదీసింది..

దాంతో నీళ్ళు నములుతున్న యువకుడిని ఆ యువతి చెడుగుడు ఆడేసింది..ఆలయమని కూడా చూడకుండా భర్తను చొక్కా పట్టుకుని బయటకి లాగి కిందపడేసి కాళ్ళతో తొక్కేసింది..చెంప మీద కొట్టడం పిడిగుద్దులు గుద్దటం తో ఆ యువకుడు బిత్తర పోయాడు..తమిళనాడులో ని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలోని సాయిబాబా ఆలయంలో గురువారం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది…