Tapsee makes fun of Raghavendra Rao’s midriff obsession

తెలుగు సినిమాకి గ్లామర్ ని పరిచయం చేసిన దర్శకుడు కే. రాఘవేంద్రరావు. హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడం అప్పటికే బాలివుడ్ లో మొదలైంది కాని, తెలుగులో అలాంటి పంథా లేదు. అప్పుడొచ్చిన రాఘవేంద్ర రావు, సినిమాల్లో గ్లామరస్ పాటలు కూడా ఓ భాగామయ్యేలా చేసారు. శ్రీదేవి, జయప్రద, విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, టబు ఇలాంటివారెందరో రాఘవేంద్రరావు సినిమాల్లో కనిపించి, పాటల్లో అందాలు ఆరబోసి పెద్ద నటీమణులు అయినవారే. రాఘవేంద్రరావు పాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. హీరోయిన్ నడుమందాలు ఆరబోస్తోంటే, పళ్ళు, పూలు వచ్చి హీరోయిన్ నడుముపై పడటం అనేది రాఘవేంద్ర రావు ట్రేడ్ మార్కు షాట్. ఈ ట్రేడ్ మార్క్ షాట్ లో ఈతరం వారు చాలా తక్కువ మంది కనిపించారు. ఆ అతితక్కువ మంది హీరోయిన్లలో తాప్సి కూడా ఉంది.

ఇప్పుడిప్పుడే బాలివుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎదుగుతున్న తాప్సి తన కెరీర్ లో తెలుగు సినిమాలతోనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులోనూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ఉత్తరాది భామ. ఆనాడు రాఘవేంద్రరావు సినిమాలో హుషారుగా కనిపించిన తాప్సి, ఇప్పుడు మాత్రం ఆయనపై జోకులు వేస్తోంది. ఇటివలే ఓ కామెడి షోలో రాఘవేంద్రరావు శైలిపై విమర్శలు చేసింది తాప్సి.