తండ్రి తాగుడుకు బానిసయ్యాడని…కూతురు బెదిరించాలని చూసింది..! చివరికి ఏమైందో తెలుస్తే షాక్.!     2018-06-17   03:13:17  IST  Raghu V

ఏటా మధ్యం మత్తులో పడి ఎంత మంది మృత్యువాత పడుతున్నారో..ఎన్ని కుటుంబాలు పెద్దదిక్కులేక రోడ్డున పడుతున్నాయో..అలాంటివారందరూ మధ్యంకి దూరం అయ్యేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చింది..కానీ చివరికి సొంత తండ్రి చేత మధ్యం మాన్పించాలని ప్లాన్ వేసింది..కాకపోతే అది విఫలమై తనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది…

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం రజక కాలనీకి చెందిన సరస్వతి, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు..వారిలో ఒకరే పదిహేనేళ్ల భార్గవి..తొమ్మిదో తరగతి చదువుతుంది.స్కూళ్లో చురుకుగా ఉండే విధ్యార్దిని భార్గవి..విధ్యార్ధి సంఘం ఎస్ఎఫ్ఐ తో పరిచయం ఏర్పడి తద్వారా ఐద్వా మహిళా సంఘం మధ్యంపై ఇచ్చే వీధినాటికల్లో పాల్గొంటుండేది.సెలవుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చింది.భార్గవి తండ్రి ఫోటో గ్రాఫర్,తల్లి స్విమ్స్ లో స్వీపర్ గా పనిచేస్తుంది..