ఎన్నారై విద్యార్ధులకి...తానా “స్కాలర్ షిప్” లు     2018-06-09   22:07:04  IST  Bhanu C

తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్ధులకి సమవంతు సాయంగా..స్కాలర్ షిప్‌లని అందిస్తోంది..ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకోవాలని వచ్చే విద్యార్ధులు డబ్బు అందకపోవడంతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్ర్రమం నిర్వహిస్తున్నమాని తెలిపారు.. 2018-19 లో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ లకి దరఖాస్తులను తానా ఆహ్వానిస్తోంది. చదువుకునే సామర్థ్యం ఉండి..ఆర్థిక స్థోమత లేని వారిని తానా ఈ రూపంలో ఆదుకుంటోంది.

అయితే మొత్తం ఏడూ రకాలుగా తానా ఈ స్కాలర్ షిప్‌లని అందిస్తోంది..గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్‌ల రూపంలో ప్రతీ విద్యార్థికి 2000 డాలర్లను అందించాలని తానా ప్రతినిధులు నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్ షిప్‌లను పొందవచ్చని వారు చెప్పారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.