Tamil Nadu woman cuts off husband’s penis and carries in hand bag

ఈమధ్య ఇలాంటి హింసాత్మక వార్తలు ఎక్కువ చూస్తున్నాం కదా. వాటి నుంచి స్ఫూర్తి పొందడం వలన ఏమో మర్మాంగాలపైనే గురి పెడుతున్నారు. గత ఏడాది భర్త తనతో శృంగారం చేయడం లేదనే కోపంతో అతడి పురుషాంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ ఏడాది మరో ఇద్దరు భారతీయ మహిళలు ఇదే పని చేసారు. కాని కారణాలే వేరు. ఈ ఇద్దరు కూడా తమ ఆత్మసంరక్షణ కోసం, తమ మానాన్ని కాపాడుకోవడం కోసం ఆ పని చేసారు. ఇక కొత్తగా ఓ తమిళనాడు మహిళ నిద్రపోతున్న భర్త మర్మంగాన్ని కోసేసింది. కారణం ఏమిటో మీరే చూడండి.

తమిళనాడులోని గుడియట్టంకి చెందిన సరసు వయసు 30 ఏళ్ళు. 16 ఏళ్ల వయసులో ఉండగానే పెళ్ళి జరిగింది. నలుగురు పిల్లలు. గత రెండేళ్లుగా భార్యభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు తరచుగా గొడవపడేవారు. దాంతో ఇద్దరు వేరు వేరుగా ఉండటం ప్రారంభించారు. పిల్లలని చదువు కోసం నానమ్మ, తాతయ్య దగ్గర ఉంచారు. భర్త ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటే, సరసు తన తల్లిదండ్రులతో ఉండటం మొదలుపెట్టింది. కాని ఒక నెల క్రితం ఇద్దరు తమ మనస్పర్థలు దూరం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాని మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం వలన గొడవలు తగ్గకపోగా, మరింత పెరిగాయి. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్యకి, భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకి అనుమానాలు పెరిగాయి.