Tamil Actor writes love letter to actress anjali

ఇప్పుడైతే తమ ప్రేమను వ్యక్తం చేయాలంటే అయితే ఒకరోజు డేటింగ్ అంటూ తీసుకెళ్ళి, ఖరీదైన హోటల్లొ భోజనం చేస్తూ, భోజనం ఇలా పూర్తవగానే అలా చిన్న సర్ ప్రైజ్ లా రింగ్ బయటకి తీసి తమ ఫిలింగ్స్ ని చెబుతున్నారు. లేదంటే సింపుల్ గా మొబైల్ ఫోన్ అందుకోని ఏదో ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నుంచి ఓ మెసెజ్ పెడుతున్నారు. కాని సోషల్ మీడియా ఏజ్ కి కొన్ని సంవత్సరాల ముందు కూడా లవ్ లెటర్స్ దే హవా. ప్రేమికుడు కాని, ప్రేయసి కాని తమ ప్రాణాల్ని అందులో నింపేసేవారు. ఇప్పుడు లవ్ లెటర్స్ రాయడం తగ్గించేసారు. కాని ఈ జమానాలో కూడా హీరోయిన్ అంజలికి లవ్ లెటర్ రాసి జనాల దృష్టిని ఆకర్షించాడు ఒక హీరో.


అ హీరో ఎవరో కాదు, తమిళ నటుడు జై. అదేనండి, అంజలి క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని మీడియా ఎప్పటినుంచో వార్తలు రాస్తోంది. ఆ వార్తలు పచ్చినిజాలని ఈ జంట మరోసారి నిరూపించింది.

నిన్న అంజలి పుట్టినరోజు. దాంతో జై తన పుట్టినరోజు గ్రీటింగ్స్ ని, అంజలిపై తనకి ఉన్న ప్రేమని, మొత్తం ఓ లెటర్ రూపంలో రాసాడు.


“ఈ ప్రత్యేకమైనది రోజు నాకు నువు ఎంత ప్రత్యేకమో, అంతే ప్రత్యేకమైనది. ఈరోజు నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటింటే, నువ్వు నీలా ఉంటూ నా జీవితంలోని ప్రతిరోజుని స్పెషల్ గా మారుస్తున్నావు. నేను, ఆ దేవుడు ఎప్పటికి నీతోనే ఉంటాము. హ్యాపి బర్త్ డే అంజు (అంజలి) .. ప్రేమతో జై” అంటూ అదిరిపోయే లవ్ లెటర్ రాసి డైరెక్టుగా ట్విట్టర్ లోనే పెట్టేసాడు ఈ హీరో.

దీనికి సమాధానంగా అంజలి “నాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు జై. నువు నాతో ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ముఖ్యమైన ఈరోజున ఇలాంటి సందేశం పంపినందుకు చాలా థ్యాంక్స్” అంటూ మురిసిపోతూ రిప్లై ఇచ్చుంది అంజలి.