కళ్ల కింద నల్లటి వలయాలకు చింతపండు వైద్యం...ఆశ్చర్యంగా ఉందా?     2017-11-02   22:38:33  IST  Lakshmi P

Tamarind Improves Skin Tone

కళ్ల కింద నల్లటి మచ్చలకు చింతపండు వైద్యం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? నిజం సిట్రిక్ యాసిడ్ లక్షణాలు ఉన్న చింతపండు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కడుపు ఉబ్బరం,త్రేన్పులు,వికారం,జ్వరం వంటి సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.

రెండు స్పూన్ల చింతపండు రసం ఉదయాన్నే తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గి ఆకలి పెరుగుతుంది.

నొప్పులు,వాపులు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో చింతపండు రసం రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

దెబ్బల వల్ల వచ్చిన వాపులు, బెణుకులకు చింతపండు గుజ్జును ఉడికించి వేడిగా ఉన్నప్పుడే రాసి కొంతసేపు ఆలా ఉంచితే బెణుకులు తగ్గుతాయి.

చింతపండు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ముఖంపై వచ్చే మచ్చలు,బ్లాక్ హెడ్స్ పోవటానికి సహాయపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

మొదట ముఖాన్ని ఫెస్ వాష్ తో శుభ్రం చేసుకొని చింతపండు రసాన్ని రాసి 5 నిముషాలు మసాజ్ చేస్తే వచ్చే మార్పు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కంటి కింద నల్లటి వలయాలకు చింతపండు రసం మంచి పరిష్కారం. చింతపండు రసాన్ని కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాస్తే నల్లటి వలయాలు మాయం అవుతాయి. అయితే ఒక వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి.

చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడిగితే ముఖంపై ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ముఖంపై మృత కణాలను తొలగించడానికి చింతపండు రసం పాలతో కలిపి స్ర్కబ్‌తో రాయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

చూసారుగా చింతపండులో ఎన్ని ఆరోగ్య అందం ప్రయోజనాలు దాగి ఉన్నాయో…మీరు కూడా ఉపయోగించండి.