Talcum Powder can develop few types of cancers in your body

అద్దం ముందు నిల్చున్నాం అంటే చాలు పౌడర్ మీదకే చేతులు వెళతాయి. గడప దాటి బయటకి వెళ్ళాలి అంటే పౌడర్ ఉండాల్సిందే. పౌడర్ ముఖానికి అద్దనిదే కాలు కదలదు. చర్మం జిడ్డుగా అనిపించడం వలన, చెమటగా అనిపించడం వలన పౌడర్ వాడుతారు జనాలు. కాని ఆ జిడ్డుని ఎలా తొలగించాలో ఆలోచించకుండా ప్రమాదకరమైన పౌడర్ మీద ఆధారపడతారు. ఇక్కడ పౌడర్ ని ప్రమాదకరం ఎందుకు అన్నాం అంటే పరిశోధనల ఫలితాలు అలా ఉన్నాయి. ఇది కొత్త స్టేట్మెంట్ కాదు, కాని పరిశోధకులు మళ్ళీ గుర్తు చేసారు .. మనం వాడే టాల్కం పౌడర్ వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక పాపులర్ టాల్కం పౌడర్ కంపెని (జాన్సన్ అండ్ జాన్సన్) మీద ఇటివలే ఒక లాసూట్ కూడా దాఖలైంది ఈ విషయం మీద.

ఈ టాల్క్ అంటే ఏమిటి ? దీమ్మి మేగ్నేశియం, సిలికోన్ మరియు ఆక్సిజన్ కలిపి తయారు చేస్తారు. ఈ టాల్క్ ఇటు టాల్కం పౌడర్ తో పాటు చిన్నపిల్లల కోసం మనం వాడే బేబి పౌడర్ లో, మనం అందం కోసం వాడే రకరకాల పౌడర్స్ లో ఉంటుంది. ఈ టాల్క్ లో క్యాన్సర్ ని తీసుకొచ్చే అస్ బెటాస్ (కార్సినోజేన్) లక్షణాలు ఉంటాయి. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, అమెరికన్ సొసైటి ఆఫ్ క్యాన్సర్ లో ఎలుకలపై పరిశోధన చేసి మరి తేల్చారు.