T-Fiber internet services to start before end of 2018 – KTR

మనిషికి మూడు అవసరాలు ఉంటాయని అంటారు. ఒకటి తిండి, రెండోది బట్ట, మూడోది ఇల్లు. డబ్బు ఎలాగో అవసరమే. డబ్బు ఉంటేనేగా ఈ మూడు ఉండేది. కాని ఈ మూడు అవసరాల మాట చాలా పాతది. డబ్బు కాకుండా, ఓ నాలుగొవ అవసరం దశాబ్దకాలం క్రితమే వెలుగులోకి వచ్చింది. అదే ఇంటర్నెట్. ఈ కాలంలో ఇంటర్నేట్ కూడా ఓ అత్యవసరమైన అవసరం అంటే కాదనగలరా?

అసలు ఇంటర్నెట్ ఒక్కరోజు లేకపోయినా ఈ ప్రపంచం ఏమైపోతుందో ఊహించండి. ప్రపంచం దాకా ఎందుకు ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే మీ రోజు ఎలా గడుస్తుందో ఓసారి ఉహించుకోండి. మరి ఇంటర్నెట్ ఓ నిత్యవసర వస్తువులా మారింది కాబట్టే మన దేశంలో 45-50 కోట్ల మంది జనం స్మార్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఇప్పుడు ఎంతలేదన్నా 20 కోట్ల మంది దగ్గర 4G మొబైల్స్ ఉండొచ్చు. చూడండి .. వేగవంతమైన ఇంటర్నెట్ మన జీవితంలో ఎలాంటి భాగమై కూర్చుందో!br/>

ఈ అవసరాన్ని జియో అతి తక్కువ ధరలో తీరుస్తోంది. కాని అంతకన్నా తక్కువ ధరలో, అతి చవకగా ఇంటర్నెట్ వస్తే? త్వరలోనే మీరు ఊహించని చవక ధరల్లో ఇంటర్నెట్ సేవలు రాబోతున్నాయి. కాని ఈ సేవలు కేవలం తెలంగాణ లో నివసిస్తున్నవారికే. ఎందుకంటే ఈ సర్వీసులు ప్రారంభించేది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి.