అలా పోగొట్టుకున్నది ఇలా వచ్చింది!     2018-05-15   01:18:57  IST  Raghu V

1990లలో అశ్వినీదత్‌ మెగా నిర్మాత. ఎన్నో మెగా సక్సెస్‌లను అందుకున్న ఆయన పలువురు స్టార్‌ హీరోలకు మంచి క్రేజ్‌ ఇచ్చాడు. అప్పట్లో ఆయన నిర్మాణంలో సినిమా అంటే ఖచ్చితంగా సక్సెస్‌ గ్యారెంటీ అనే టాక్‌ ఉంది. అందుకే ఆయన బ్యానర్‌లో కొత్త హీరోలు, స్టార్‌ హీరోలు అంతా కూడా నటించేందుకు ఆసక్తి చూపించే వారు. భారీ చిత్రాలకు అప్పట్లో పెట్టింది పేరు అయిన అశ్వినీదత్‌ ఆ తర్వాత కాల క్రమంలో కనుమరుగయ్యాడు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘శక్తి’ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ నిర్మాత కనిపించకుండా పోయాడు. ఆ దెబ్బకు పు ఆస్తులు అమ్ముకోవడంతో పాటు, సినిమా నిర్మాణంకు దూరం అయ్యాడు.

అశ్వినీదత్‌ కుమార్తెలు మళ్లీ స్వప్న సినిమా బ్యానర్‌ను స్థాపించి రెండు మూడు చిన్న చిత్రాలను నిర్మించారు. వారికి ఆ సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఆయన కుమార్తెలు తాజాగా మహానటి చిత్రాన్ని నిర్మించారు. వారి వెనుక అశ్వినీదత్‌ ఉండి నడిపించారు. మహానటికి సమర్పకుడిగా వ్యవహరించిన అశ్వినీదత్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తుంది. మళ్లీ అశ్వినీదత్‌కు మంచి రోజులు ప్రారంభం అయ్యాయని, ఆయన మళ్లీ పెద్ద సినిమాలు తీస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మహానటితో అశ్వినీదత్‌ పేరు మీడియాలో మారు మ్రోగుతోంది. ఈ సౌండ్‌ ఇలాగే కంటిన్యూ అవ్వడం ఖాయం అని, ముందు ముందు ఆయన నుండి పెద్ద సినిమాలు వస్తాయని అంతా ఆశిస్తున్నారు.