స్వీట్ పొటాటో తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు     2018-06-23   21:07:39  IST  Lakshmi P

ముదురు పింక్ రంగులో ఉండే కందగడ్డను చాలా మంది ఇష్టపడరు. అయితే అవి అందించే లాభాలను తెలుసుకుంటే తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకుంటారు. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఈ కందగడ్డలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కందగడ్డను చిలకడదుంప అని కూడా పిలుస్తారు. అయితే చాలా మంది కందగడ్డ తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ మితంగా తింటే బరువు పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు కందగడ్డ తినటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

కంద గడ్డలో బీటా కెరోటీన్ సమృద్ధిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాక చర్మ సమస్యలను తగ్గిస్తుంది. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి చర్మానికి రక్షణ ఇస్తుంది.