సినీ నటితో స్వామీజీ రాసలీలలు     2017-10-26   21:35:02  IST  Raghu V

Swamiji $exual relation with heroine

గుర్మిత్ సింగ్ షాక్ ఇంకా కోలుకోలేదు..అప్పుడే మరొక షాక్ కర్ణాటకాలో చోటుచేసుకుంది.మరొక స్వామీజీ రాసలీలలు భాగోతం వెలుగుచూసింది.యలహంకలోని మద్దేవనపురలోని తన మఠంలోనే నంజీశ్వర్‌ స్వామీజీ ఓ మహిళతో అభ్యంతరకరమైన స్థితిలో ఉన్న వీడియో కలకలం సృష్టించింది. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మఠంలోని ఓ గదిలో స్వామీజీతో ఉన్న మహిళ ఓ సినీనటి అని తెలుస్తోంది. అయితే, ఆ నటికి సంబంధించిన పూర్తి వివరాలేమీ ఇంకా తెలియలేదు. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి కుమారుడైన నంజీశ్వర్‌ ప్రస్తుతం మఠం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ నంజీశ్వర్‌ స్వామీజీ అలియాస్‌ దయానంద్‌ 2011లోనే ఈ మఠానికి అధిపతి కావాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ఆయన తన పేరును దయానంద్‌గా మార్చుకున్నారు.సుమారు 500 సంవత్సరాల చరిత్ర కల్గిన ఈ మఠం సంరక్షణలో 220 ఎకరాల భూమి ఉంది.. మఠానికి కేటాయించిన భూముల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ మహిళతో రాసలీలల వ్యవహారం తనకి కొత్తేమీ కాదని. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని..వివాహేతర సంభందాలు ఈ స్వామీజికి ఎక్కువే అని ఆరోపణలు ఉన్నాయి.

అయితే బాబా బాగోతాల్ని బయటపెట్టాలని అనుకున్న కొందరు రహస్య కెమెరా ద్వారా స్వామీజీ రాసలీలల కార్యక్రమ్మాన్ని చిత్రీకరించి ఉంటారని అంటున్నారు కొంతమంది..లోకల్ టీవీ చానళ్ళ ద్వారా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అందరు ముఠం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తంచేస్తున్నారు. కొందరు స్వాములు సైతం దయానంద్‌ తక్షణమే మఠం బాధ్యతలనుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మఠం వద్ద పోలీసులు మోహరించారు. అయితే ఆ బాబాపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదు అని.ఎవరన్నా ఫిర్యాదు చేస్తే తప్పకుండ చర్యలు తీసుకుంటా అని పోలీసులు తెలిపారు. ఈ అంశంపై బెంగళూరు నగర ఈశాన్యజోన్‌ డీసీపీ గిరీశ్‌ మాట్లాడుతూ.. దయానందపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకోలేదని స్పష్టంచేశారు. తమకు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామన్నారు