సర్వే సాక్షిగా..'కేజ్రీవాల్' హీరో!!     2015-02-05   00:18:10  IST  Bhanu C

Surveys says AAP will win in Delhi

ఎన్నికల కోలాహాలంతో వేడెక్కిన హస్తిన రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది..నిన్నమొన్నటి వరకు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు అన్న వార్తలు గుప్పు మన నేపధ్యంలో ఇప్పటి సర్వేల ప్రకారం పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది….విషయం ఏమిటంటే…ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అమ్‌ అద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీని ఆప్‌ వెనక్కి నెట్టేసింది. 37 స్థానాలతో ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఒకటి కాదు, రెండు కాదు..దాదాపుగా మూడు సర్వేలు ఢంకా బాజాయిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల నిర్వహించిన మూడు సర్వేల ఫలితాలు చూస్తే 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆప్‌కు 37 సీట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోవడం ఖాయమని సర్వేలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.. ఇక సర్వేల వివరాలు చూస్తే…హిందూస్థాన్‌ టైమ్స్‌ – సీ ఓటర్‌ సర్వే ప్రకారం ఆప్‌కు 36 నుంచి 41, బీజేపీకు 27 నుంచి 32, కాంగ్రెస్‌కు 2 నుంచి 7 స్థానాలు రావచ్చునని తెలిపింది. ఏబీపీ న్యూస్‌, నీల్సన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆప్‌కు 35, బీజేపీ 29, కాంగ్రెస్‌ 6 స్థానాలు రావచ్చునని వెల్లడించింది. ది ఎకానమిక్‌ టైమ్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే… అప్‌కు 36 నుంచి 40, బీజేపీ 28 నుంచి 32, కాంగ్రెస్‌కు 2 నుంచి 5 స్థానాలు రావచ్చునని తెలిపింది. మరి ఇందులో ఏ సర్వే నిజమైనా ఆప్ కు మళ్లీ అధికారం దక్కినట్లే.