సురేష్‌బాబు గారు నీతు ఇతరులకేనా? మీకు వర్తించవా?     2018-07-03   22:13:35  IST  Raghu V

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా సినిమాల ప్రమోషన్స్‌ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అప్పట్లో సినిమా విడుదలకు ముందు ఆడియో వేడుక, సినిమా సక్సెస్‌ అయితే 50 రోజులు లేదా 100 రోజుల వేడుకలు మాత్రమే నిర్వహించేవారు. కాని ఇప్పుడు రకరకాలుగా ఈవెంట్‌లు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఆడియో వేడుక, ప్లాటినం డిస్క్‌ వేడుక మరియు ప్రీ రిలీజ్‌ వేడుకలు జరుపుతున్నారు. ఇక సినిమా విడుదలైన వారం పది రోజులకే సక్సెస్‌ వేడుక, థ్యాంక్స్‌ మీట్‌లు అంటూ మీడియాలో సందడి చేస్తున్నారు.

సక్సెస్‌ వేడుక, థ్యాంక్స్‌ మీట్‌లు సినిమా సక్సెస్‌ అయితే నిర్వహిస్తే పర్వాలేదు అనిపిస్తుంది. కాని సినిమాలు ఫ్లాప్‌ అయినా కూడా సక్సెస్‌ వేడుక, సక్సెస్‌ మీట్‌లు నిర్వహించడం విమర్శలకు తావిస్తుంది. సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయినా కూడా నిసిగ్గుగా సక్సెస్‌ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ సక్సెస్‌ మీట్‌లపై ఆమద్య ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పట్లో సురేష్‌బాబు మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న సక్సెస్‌ మీట్‌లు, థ్యాంక్స్‌మీట్‌లు చిరాకుగా అనిపిస్తున్నాయి. సినిమా సక్సెస్‌ కాకున్నా కూడా ఇలాంటి ప్రచారం నిర్వహించడం వల్ల, అసలైన సక్సెస్‌ మూవీ ఏదో ప్రేక్షకులు తెలుసుకోలేక పోతున్నారు అంటూ సురేష్‌బాబు విమర్శలు చేయడం జరిగింది.