Super Mario Run to roll out on March 23 .. details here

చిన్నప్పుడు సూపర్ మారియో గేమ్ ఆడేవారం గుర్తుందా? అయినా ఆ గేమ్ ని ఎలా మరచిపోతారు. మన బాల్యంలో ఆ గేమ్ ఆడినంతగా మరో గేమ్ ఆడి ఉండం కదా. అదేం 3డి గేమ్ కాదు, ఎగబడి చంపడాలు ఉండేవి కాదు, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఈ స్మార్ట్ ఫోన్లు, ప్లే స్టేషన్లు కూడా తెలియదు. తెల్సిందల్లా టీవి వీడియో గేమ్ ఒక్కటే. కీబోర్డ్ లా వచ్చే ఈ వీడియో గేమ్ ని టీవికి కనెక్ట్ చేసి, మన క్యాసెట్లు ఫ్రెండ్స్ కి ఇచ్చి, మనవద్ద లేని క్యాసెట్లు ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకోని ఆడటం ఓ మధరానుభూతి. అందులోనూ, సూపర్ మారియో ఆడుతుంటే, టైమ్ ఎట్లా గడిచిపోయేదో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, అధునాతనమైన టెక్నాలజీతో వస్తున్న గేమ్స్ ఉన్నా, ఆ కిక్కు దొరకట్లేదు.

కాని, చింతించాల్సిన అవసరం ఇకపై లేదు. మన సూపర్ మారియో తిరిగి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే iOS వారి మొబైల్స్ లో సందడి చేస్తున్న మన బుల్లి మారియో, మార్చి 23 నుంచి కోట్లాది అండ్రాయిడ్ మొబైల్స్ లో దర్శనమివ్వనున్నాడు. సూపర్ మారియో రన్ పేరుతో, సరికొత్త స్టయిల్ లో వస్తున్నాడు మారియో. మళ్ళీ మనం మారియోని మష్రూమ్ కింగ్డమ్ లో పరుగులు పెట్టించవచ్చు, మళ్ళీ బౌజర్ పంపించే శక్తుల నుంచి మారియోని కాపాడుతూ, మన హీరోని ప్రిన్సెస్ దగ్గరికి చేర్చవచ్చు. మళ్ళీ జెండా ఎగురవేయవచ్చు, మళ్ళీ కోటలో టపాసులు పేల్చవచ్చు. మన బాల్యంలోకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు.

అందుకే ఆలస్యం చేయకండి. ఈ లింక్ మీద క్లిక్ చేసి -> https://play.google.com/store/apps/details?id=com.nintendo.zara త్వరగా ప్రీ రిజిస్టర్ అవండి. ప్రి రిజిస్టర్ అయిన యూజర్లకి అదనపు లాభాలు ఉంటాయంట. మరి ఇంకా అలా ఆశ్చర్యంతో ఎంతసేపు చూస్తారు? ప్లేస్టోర్ లోకి వెళ్ళి ఆప్షన్ నొక్కడమే.