Super benefits of superfood Fava Beans

చిక్కుడు కాయ ఎంత రుచిగా ఉంటుందో ! ఓరకంగా చెప్పాలంటే ఇది వెజ్ ఐటమ్స్ లో నాన్ – వెజ్ ఐటం లాంటిది. చిక్కుడు బాగా పండి, చిక్కుడు ఇత్తులు బాగా ఉండాలే కాని, దీన్ని చికెన్ మటన్ లాగా లాగించేస్తారు చాలామంది. ఎందుకంటే చిక్కుడు రుచి అలాంటిది. చిక్కుడు తింటే వచ్చే లాభాలు ఎన్నో ఉన్న, ఇది అందరికి పడదు. రెడ్ బ్లడ్ సెల్స్ లో సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించే దీన్ని తినాలో వద్దో అడగాలి. అలాగే బాగా పెరిగిన చిక్కుడు మాత్రమె తినాలి. మన ఇంట్లో చిక్కుడు చెట్టు ఉండి, ఆ చిక్కుడు తినడమే మేలు. ఎందుకంటే చికుడు పురుగుల బారిన, ఫంగల్ ఎలిమెంట్స్ బారిన పడుతుంది. బయట కొన్న చిక్కుడు ఎలాంటి పురుగులతో పెరిగినా అమ్మేవారు అదంతా పట్టించుకోరు. కాని మంచి చిక్కుడు మనకు దొరకాలే కాని ఇన్ని లాభాలున్నాయి.

* చిక్కుడు లో కాల్షియం, ఐరన్, మేగ్నేశియం, మంగనీజ్, ఫాస్ ఫరాస్, పొటాషియం, జింక్ లాంటి మినరల్స్ బాగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, కారోబోహైడ్రేట్, పెద్ద మొత్తంలో కాలరీలు కూడా ఉంటాయి.

* చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ దండిగా ఉంటుంది. కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవల్స్ ని, అటు కొలెస్టరాల్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్టగలదు. ఇది గుండె ఆరోగ్యాగానికి చాలా మంచిది.