ఆ డ్రెస్ వేసుకోవడం మోడికి తప్పుగా అనిపించలేదు అంటున్న సన్ని

మొన్న తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకోని, మళ్ళీ భూమి మీద ఊపిరి పీల్చుకుంటున్న సన్ని లియోన్, మనసు విప్పి మీడియాతో మాట్లాడింది. జంతు సంరక్షణ సంస్థ పెటా కోసం శాకాహారన్ని ప్రమోట్ చేస్తున్న సన్ని, ఓ హాట్ ఫోటోషూట్ కూడా చేసింది. ఇక సన్నిని నరేంద్ర మోడి – ప్రియాంక చోప్రా వివాదం గురించి అడిగారు జర్నలిస్టులు.

ఆ వివాదం గురించి మీకు తెలిసే ఉంటుంది. మొన్నామధ్య ప్రియాంక భారత ప్రధాని నరేంద్రమోడి తో భేటి అయ్యింది. జర్మని పర్యాటనలో ఉన్న మోడిని బెర్లిన్ లో కలుసుకున్న ఈ హాలివుడ్ + బాలివుడ్ నటి, ఆ భేటిలో వేసుకున్న స్కర్ట్ వివాదస్పదమైంది. దేశ ప్రధానిని కలవడానికి వెళుతూ ప్రియాంక అలాంటి డ్రెస్ ఎలా వేసుకుంటుంది, తొడలు చూపిస్తూ ఆ వయసులో ఉన్నవాడి ముందు ఎలా కూర్చుంటుంది అంటూ కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించమని సన్నని అడిగితే, ప్రియాంకకి ఫుల్ సపోర్టు ప్రకటించింది సన్ని. ప్రియాంక వేసుకున్న డ్రెస్ లో ఎలాంటి తప్పు లేదంటోంది లియోన్. ఒకవేళ ఆ డ్రెస్ బాగాలేకపోతే మోడి తన అభ్యంతరం వ్యక్తం చేసేవారని, మోడి ఏదైనా సూటిగా మాట్లాడే వ్యక్తి అని, ఆయన ఏం అనలేదు లేదు అంటే ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఆయనకి లేని ఇబ్బంది మిగితావారికి ఎందుకు అని ఎదురుప్రశ్నించింది సన్ని.