వేసవికాలంలో జుట్టును ఏ విధంగా సంరక్షించుకోవాలి?     2018-05-01   00:34:55  IST  Lakshmi P

వేసవికాలంలో విపరీతమైన వేడి జుట్టు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ కాలంలో కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టుకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. వేసవికాలంలో జుట్టు ఆరబెట్టటానికి బ్లోయర్స్ వాడకూడదు. బ్లోయర్స్ వాడితే జుట్టుకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. అందువల్ల జుట్టు సాధారణ గాలికి అరే విధంగా చూసుకోవాలి. ఎక్కువగా ఎండలో తిరగకూడదు.

జుట్టుకు హెయిర్ సీరంను రాస్తూ ఉండాలి. ఇలా రాస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు తేమగా ఉంటాయి. అంతేకాక జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. అయితే మీ జుట్టు తత్వానికి సెట్ అయ్యే హెయిర్ సీరంని కొనుగోలు చేసి ఉపయోగించాలి. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ లేదా టోపీతో జుట్టును కవర్ చేయాలి. ఈ విధంగా చేయకపోతే జుట్టు వేడి గాలికి కఠినంగా మారిపోతుంది.