ఢీ 10 షో కు సుడిగాలి సుధీర్ గుడ్ బై ? కారణం ఏంటో తెలిస్తే షాక్     2018-06-07   05:47:19  IST  Raghu V

సుడిగాలి సుధీర్ గురించి అందరికి తెలిసిందే , జబర్దస్త్ షో తో మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో లో టీం లీడర్ గా వ్యవహరిస్తూ మంచి కామెడీ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. సుదీర్ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ‘జబర్దస్త్’ షో కాకుండా ఢీ 10 షో , పొర పోవే మరియు మరికొన్ని షో లు కూడా చేస్తున్నాడు.

బుల్లితెర షో లు చేస్తూ బిజీగా ఉన్న సుదీర్ కి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటివరకు అడపా దడపా సినిమాలు చేసిన సుదీర్ కి ఇప్పుడు మంచి అవకాశాలు తలుపు తట్టాయట.
దాంతో సినిమాల వైపుకు వెళ్ళటానికి కొన్ని షో లను తగ్గించుకుందామని ప్లాన్ చేస్తున్నాడట.అప్పట్లో సర్దార్ గబ్బర్ సింగ్ , నేను శైలజ వంటి సినిమాల్లో చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.