Sudheer will be a Star – Mahesh Babu

సూపర్ స్టార్ ఫ్యామిలి నుంచి వెండితెరకు పరిచయమైన నటుడు సుధీర్ బాబు. ధృఢమైన దేహం, డ్యాన్స్ లో గ్రేస్ .. అన్నీ ఉన్నా సుధీర్ కి సరైన హిట్స్ లేవు. ప్రేమకథాచిత్రమ్ భారి బ్లాక్ బస్టర్ గా నిలిచినా దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు సుధీర్. ఆడు మగడ్రా బుజ్జి ఫ్లాప్ అవడం , ఆ తరువాత సంవత్సరం గ్యాప్ ఇచ్చిన ఈ యంగ్ హీరో, మోసగాళ్ళుకు మోసగాడుతో మరో ఫ్లాప్ అందుకోగా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఫర్వలేదు అనిపించింది.

సుధీర్ కొత్త సినిమా పేరు భలే మంచి రోజు. నిన్నే ఈ చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ బాబు చిత్రాన్ని, చిత్ర యూనిట్ ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంధర్భంగా సుధీర్ అంటే తనకు చాలా ఇష్టమని, చాలా కష్టపడతాడని, ఒక్క కరెక్ట్ సినిమా పాడితే చాలు, సుధీర్ స్టార్ అయిపోతాడని, ఆ ఒక్క సినిమా భలే మంచి రోజు కావాలని చెప్పుకొచ్చాడు మహేష్.

70 ఎమ్ ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్, శశి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధీర్ సరసన వామికా అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయమవుతోంది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.