మహేష్ బాబు గురుంచి సుధీర్‌ బాబు ఆలా అన్నాడేంటి  

సుధీర్‌ బాబు ఇంకాస్త ముందుకు అడుగు వేసి తనకు అవకాశాలు లేని సమయంలో, రాని సమయంలో మహేష్‌బాబు దర్శక నిర్మాతలతో మాట్లాడి నాకు సినిమాలు ఇప్పిస్తున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న వార్తు ఏమాత్రం నిజం కాదని, నాకు మహేష్‌బాబు అవసరం లేదని, అసలు మహేష్‌బాబు నా సినిమా ప్రమోషన్స్‌కు రాకున్నా కూడా పెద్దగా ప్రభావం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. నాకు హిందీలో మంచి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని తెలుగుపై ఇష్టంతో, తెలుగు సినిమా పరిశ్రమలోనే కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే తాను కరణ్‌ జోహార్‌ ఇచ్చిన ఆఫర్‌ను కాదన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

తెలుగులో కాదంటే హిందీలో కూడా తనకు ఛాన్స్‌లు దక్కుతాయని, తన ఛాన్స్‌ల కోసం మహేష్‌బాబును రంగంలోకి దించేంతటి మూర్ఖుడిని కాదు అంటూ సుధీర్‌బాబు చెప్పుకొచ్చాడు. సుధీర్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలపై మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మహేష్‌బాబు సాయం పొంది, ఆయన వల్ల ఈస్థాయి గుర్తింపు రాబట్టుకుని ఇప్పుడు ఆయన్నే కాదనేంత వాడివి అయ్యావా అంటూ సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో ఛాన్స్‌ వచ్చేంత సీన్‌ నీకు లేదు అని, నమ్రత రికమండేషన్‌ వల్ల ఒక హిందీ సినిమాలో నటించిన నువ్వు బాలీవుడ్‌ స్థాయికి వెళ్లగలవా అంటూ మహేష్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.