చీర కట్టిందని ఊరు మహిళా అని ఎగతాళి చేసారు..! వారికి ఆమె ఇచ్చిన కౌంటర్ హైలైట్..!     2018-06-10   00:23:10  IST  Raghu V

ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా మూర్తి గురించి తెలుసు క‌దా. ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ నారాయ‌ణ మూర్తి భార్య ఆమె. ఈమె గేట్స్ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో కూడా భాగ‌స్వామిగా ఉన్నారు. అయితే సుధా మూర్తి ఓ పుస్త‌కం రాశారు. త‌న జీవితంలో జ‌రిగిన ప‌లు విష‌యాల‌ను కూడా అందులో ప్ర‌స్తావించారు. త్రీ థౌసండ్ స్టిచెస్‌: ఆర్డిన‌రీ పీపుల్‌, ఎక్స్‌ట్రార్డిన‌రీ లైవ్స్ అనే పుస్త‌కాన్ని రాసిన ఆమె త‌న విష‌యాల‌ను అందులో తెలియ‌జేశారు. అయితే ఆ పుస్త‌కంలో ఆమె త‌న జీవితంలో జ‌రిగిన ఓ ముఖ్య సంఘ‌ట‌న గురించి వివ‌రించారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సుధామూర్తి ఓ సారి లండ‌న్ నుంచి బెంగుళూరుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. అందుకు గాను బిజినెస్ క్లాస్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌లోని హీత్రూ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్‌కు ఆమె చేరుకున్నారు. అయితే సాధార‌ణంగా ఆమె ఎక్కువ‌గా చీర‌లే క‌డ‌తారు. కానీ ప్ర‌యాణాల్లో ఉంటే చుడీదార్ వేసుకుంటారు. ఆ స‌మ‌యంలో ఆ డ్రెస్ సౌక‌ర్యంగా ఉంటుంద‌ని ఆమె భావిస్తారు. అందుకే ఆ డ్రెస్ ఆ రోజు కూడా అదే డ్రెస్ వేసుకున్నారు. చూసేందుకు చాలా సాదా సీదాగా ఉంటారామె. త‌న డ్రెస్సింగ్ కూడా ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆరోజు వేసుకున్న చుడీదార్ కూడా పెద్ద ఖ‌రీదైందేమీ కాదు. అయితే అలా ఆమె ఎయిర్‌పోర్టుకు వ‌చ్చాక కొంత సేపు వెయిట్ చేశారు. అనంత‌రం బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కేందుకు లైన్లో నిల‌బ‌డ్డారు.