నీట్ విద్యార్ధిని ఆత్మహత్యకి ముందు ఏం జరిగిందో తెలుసా.? ఆమె తల్లి ఏం చేసిందంటే.?

హైదరాబాద్ అబిడ్స్ లో విషాదం చోటు చేసుంది. మయూరి బిల్డింగ్ పై నుంచి దూకి కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్ ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు చెబుతున్నారు బంధువులు.వివరాల లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మయూరి బిల్డింగ్ లోకి కౌర్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. నేరుగా 9వ అంతస్తుపైకి వెళ్లింది. అక్కడ్నుంచి కిందకు దూకింది.

బిల్డింగ్ పైనుంచి దూకుతున్నప్పుడు చుట్టుపక్కల వారు, కింద ఉన్న వారు కేకలు వేశారు. దూకొద్దు అని అరిచారు. దూకితే ఎలా రక్షించాలని కొందరు ఆలోచన చేస్తున్నారు.. మరికొందరు పోలీసులకు ఫోన్ చేశారు.. మరికొందరు కాపాడేందుకు బిల్డింగ్ పైకి పరిగెత్తారు.. మరికొందరు దుప్పటాలు, కవర్లు తెచ్చి కింద పడకుండా కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. అందరూ ఎవరికి వారు కాపాడాలనే ఆలోచనలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది.

తల్లి ఓదార్చినా స్వాంతన లేదు:

ఆమె ఇంట్లో చెప్పి వచ్చిన తర్వాత ఆ భవనంపై స్కూటీని పార్క్ చేసింది. పైకి వెళ్లిన తర్వాత అందరూ వద్దని అరుస్తుండగా ఆమె కళ్లు మూసుకొని కిందకు దూకేసింది. నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని ఆ యువతి తల్లి వద్ద కంటతడి పెట్టింది. కానీ ఆ తల్లి ఆమెను ఓదార్చింది. మరోసారి ప్రయత్నిస్తే మంచి ర్యాంకు వస్తుందని ధైర్యం చెప్పింది. తల్లి ధైర్యం చెప్పినా జస్లీన్‌కు స్వాంతన చేకూరలేదు. ఒత్తిడిలో అఘాయిత్యానికి పాల్పడి కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. పరీక్షలు బాగానే రాసినట్లు నీట్ రాసిన అంతరం తల్లిదండ్రులతో సహా అందరికీ చెప్పింది.