భారత ఎన్నారైలలో మళ్ళీ మొదలైన గుబులు..     2018-07-09   03:53:00  IST  Bhanu C

అమెరికాలో తెలంగాణా యువకుడిపై జరిగిన కాల్పుల వలన మళ్ళీ భారత ఎన్నారైలలో ఆందోళన మొదలయ్యింది. …ఈ దాడి చేయడతంలో మళ్ళీ భారత ఎన్నారైలకి అమెరికా పేరు వింటేనే ఆందోళన కలుగుతోంది…గతంలో కూచిబోట్ల శ్రీనివాస్ పై జాత్యహంకార హత్య జరిగిన సమయంలో కూడా ఎంతో మంది ఎన్నారైలు ఏంటో ఆందోళన చెందారు..అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత

అమెరికాలోని కాన్సస్‌లో జరిగిన కాల్పుల్లో శరత్ మరణం మళ్ళీ భయాందోళనలు కలుగచేస్తోంది..శరత్ విషయంలో అసలేం జరిగిందంటే వరంగల్‌ జిల్లాకు చెందిన శరత్‌ అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీలో చదువుతున్నాడు. .శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కాన్సస్‌లోని ఒక రెస్టారెంట్‌లోకి దుండగులు చొరబడి విచక్షిణారహితంగా జరిపిన కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కాన్సస్‌ నగర పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని శరత్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.

అయితే ఇదే తరాహాలో కూచి బోట్ల ఉదంతం కూడా జరిగిన తరువాత అమెరికా కోర్టు శ్రీనివాస్ ని చంపిన నేరస్తుడికి యావజ్జీవం వేసింది అయితే ఈ ఉదంతంలో మళ్ళీ శరత్ పై ఇదే తరహా దాడి జరగడంతో జాత్యహంకార మూలాలు ఇంకా అలానే ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు..ఈ సమయంలోనే ట్రంప్ ప్రభుత్వం ఏదన్న చర్యలు తీసుకోవాలని మరో మారు ఇలాంటి అఘాయిత్యాలు జరుగకుండా చేయాలని భారత ఎన్నారైలు కోరుకుంటున్నారు