బ్రేకింగ్ న్యూస్ ..బీజేపి సీఎం అభ్యర్ధిగా జగన్     2018-06-15   03:29:40  IST  Bhanu C

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వార్తలు వింటామో ఎవరికీ తెలియదు..ఒక్క సారిగా రాజకీయ పరిస్థితులు తల్లకిందులు అవుతూ ఉంటాయి పార్టీలకి పార్టీలు తుడిచి పెట్టుకు పోతూ ఉంటాయి..అయితే ఎప్పటి నుంచో దక్షిణాదిలో పాగా వేద్దామని సరైన సమయం కోసం వేచి చూస్తున్న బీజేపి ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది..బీజేపి వైసీపి పొత్తు ఉంటుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు మరొక సంచలన వార్త గుప్పుమంది..ఒక్క సారిగా అందరూ ఈ వార్తతో షాక్ కి గురయ్యారు.

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపిని బీజేపి లో విలీనం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది..జాతీయ మీడియా ఛానల్ ప్రసారం చేసిన కథనాల ప్రకారం బిజెపి తో వైకాపా పొత్తు లాంఛనమే అని తెలుస్తుంది..బీజేపి వర్గాలలో కూడా ఈ చర్చ జోరుగా సాగుతోంది.. అంతేకాదు ఈ విలీన బేరానికి మధ్యవర్తిత్వం నడిపింది కూడా ఎవరో కాదు గాలి బ్రదర్ అని కూడా సంచారం ఉందట…ఆపరేషన్ గరుడలో భాగం గా చంద్రబాబు వ్యతిరేక శక్తులు అన్నిటిని ఒక ప్లాట్ ఫారం మీదకి తీసుకుని వచ్చి పోరాడాలని నిశ్చయించినట్టు తెలుస్తుంది.