అగ్ర హీరోపై అలిగిన గర్ల్ ఫ్రెండ్ - ఒక టాప్ హీరోయిన్ కారణం  

బాలివుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ లవ్ ఎఫైర్ల గురించి కొత్తగా చెప్పేదేముంది. అరడజనుపైగా హీరోయిన్లను తన గర్ల్ ఫ్రెండ్స్ గా మెయింటేన్ చేసాడు ఈ అయిదు పదుల బ్యాచిలర్. ఎవరితోనూ ఎక్కువకాలం కొనసాగని సల్మాన్, కత్రీనాతో మాత్రం డీప్ గా వెళ్లి, పెళ్ళి ఆలోచనలు కూడా చేసాడు. వీరిద్దరి పెళ్ళి చేసుకోవడం ఇక ఖాయం అని అందరు అనుకున్న సమయంలో ఇద్దరు బ్రేక్ అప్ చెప్పేసుకున్నారు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ జీవితంలో లులియా వంతూర్ అనే రోమానియన్ అమ్మాయి ఉంది. కాని కత్రీనా మూలానా ఈ లవ్ స్టోరి కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కత్రీనా రణబీర్ కపూర్ దగ్గరికి వెళ్ళిన తరువాత సల్మాన్ కత్రీనాని దూరం పెట్టాడు. కాని కత్రీనా రణబీర్ కి బ్రేకప్ చెప్పాగానే ఏమైందో కాని మళ్ళీ దగ్గరకి తీసాడు. ప్రస్తుతం సల్మాన్ – కత్రీనా కలిసి టైగర్ జిందా హై అని సినిమా కూడా చేస్తున్నారు. ఫ్రెండ్ షిప్ మళ్ళీ చిగురించింది. కాని వీరి స్నేహం లూలియాకి నచ్చడం లేదు అనుకుంటా.

సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ పెద్ద పార్టి ఇచ్చింది. ఈ పార్టీకి బాలివుడ్ కి పెద్ద పెద్ద ముఖాలు దాదాపుగా అన్ని వచ్చేసాయి. సల్మాన్ ఒకప్పటి శత్రువు, ఇప్పటి స్నేహితుడు షారుఖ్ ఖాన్ కూడా పార్టీలో కనిపించాడు. కాని లులియా మాత్రం రాలేదు. అందుకు కారణం ఆ పార్టీకి కత్రీనా కూడా రావడమే అంట. సల్మాన్ ని కత్రీనాతో చూడటం ఇష్టం లేకే లూలియా సల్మాన్ ఫ్యామిలి ఫంక్షన్ కి రాలేదు అంట. మరి కేవలం అలక అయితే ఫర్వాలేదు కాని విషయం తేడా కొడితే మన బ్రహ్మచారి సల్మాన్ మళ్ళీ కొత్త గర్ల్ ఫ్రెండ్ కి వెతుక్కోవాల్సిందే.