జ‌గ‌న్‌కు ఈ స్టార్ హీరోల ప్ర‌చారం...  

ఇక మంచు ఫ్యామిలీ కూడా వైసీపీకి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మోహ‌న్‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీకాళ‌హ‌స్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరోలే కాకుండా కోలీవుడ్ వాళ్ల నుంచి కూడా జ‌గ‌న్‌కు మంచి స‌పోర్ట్ ల‌భిస్తుండ‌డం విశేషం. తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ జగన్ ను అభినందించడం ఆసక్తిదాయకంగా మారింది. సోషల్ సర్వీస్ లో ముందుండే ఈ హీరో ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ జగన్ ను అభినందించాడు.

మూడు వేల కిలోమీటర్ల దూరం నడవడం మామూలు విషయం కాదు… అంద‌రి క‌ష్టాలు ఇలా పాద‌యాత్ర‌లో తెలుసుకోవాలంటే ఎంతో ఓపిక ఉండాలి… ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ త‌న‌కు చాలా ఇష్టం అని విశాల్ చెప్పాడు. గ‌తంలోనే మ‌రో త‌మిళ్ హీరో సూర్య కూడా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప‌లికాడు. జ‌గ‌న్ పాద‌యాత్ర టైంలో ఇటు వ‌చ్చిన సూర్య జ‌గ‌న్‌ను అభినందించాడు.

ఇదిలా ఉంటే విశాల్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తాడ‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. విశాల్ తమిళ్‌లో పాపుల‌ర్ అయినా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్య‌క్తే. సోష‌ల్ స‌ర్వీస్‌లో ముందుండే విశాల్ ఇలా డేర్‌గా జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేయ‌డంతో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. వీరిద్ద‌రిది ఒకే సామాజిక‌వ‌ర్గం కావ‌డం కూడా ఓ కార‌ణ‌మ‌ని కొంద‌రు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా విశాల్ డేర్‌గా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం విశేషం.