శ్రీదేవి మాట విని బోణి కపూర్ ని లెక్కచేయని స్టార్ దర్శకుడు    2018-03-04   22:29:20  IST  Raghu V

శ్రీదేవి అంటే ఒక సునామీ. ఆమెకి కేవలం ప్రజాధరణే కాదు అభిమానుల ప్రేమ , మరి ఫిలిం సెలబ్రిటీల్లోనూ డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు. మనకి తెలిసింది రామ్ గోపాల్ వర్మ ఒకరు. శ్రీదేవిని ఆరాధించిన టెక్నీషియన్లు, నటీనటులకు లెక్కే లేదు. అందులో తాను ఉన్నానంటున్నాడు ఈ స్టార్ దర్దకుడు సుకుమార్. తన యుక్తవయసులో శ్రీదేవిని అమితంగా ఆరాధించేవాడినంటూ అయన చెప్పాడు. అప్పట్లో కుర్రకారులకి దేవతంటే శ్రిదేవే అని ఆయన అన్నారు.

శ్రీదేవి నటించిన ఎన్నో సినిమాలు చూసినా, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తన ఫేవరెట్ సినిమా అని చెప్పుకొచ్చాడు సుకుమార్. ఈ సినిమాని ఒక్కసారి కాదు, ఎన్నో సార్లు చూసాడట. ఈ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలని, వరదల్లో కూడా వెళ్లి సినిమా చూసోచ్చానంటూ శ్రీదేవి పై తనకున్న అభిమాన్నాన్ని పంచుకున్నాడు.

తను ఎన్నడూ, శ్రీదేవిని కలవలేదని, కాని ఆమె పరోక్షంలో ఆమె ఒరిజినల్ వాయిస్ విన్నానని చెప్పాడు సుకుమార్. కొంత కాలం క్రితం, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ని కలిసానని, అదే సమయంలో శ్రీదేవి కాల్ చేసిందని, ఆమె వాయిస్ బయటకి వినిపిస్తుండటంతో తాను వేరే పనిలో ఉన్నప్పటికీ తన ద్యాసంతా శ్రీదేవి వాయిస్ మీదే నిలిచిందని, ఆమె పట్ల తనకున్న అభిమానం అలాంటిదని చెప్పుకొచ్చాడు సుకుమార్. ఇలా ఇంత త్వరగా ఆమె చనిపోడం, చాల బాధాకరం అని అయన అన్నాడు.