లావుగా ఉన్నోళ్లే…శృంగారంలో సూపర్ అంట.! సైంటిస్ట్ లు ఎందుకలా అంటున్నారంటే.?     2018-06-16   01:02:08  IST  Raghu V

కండ‌లు తిరిగే సిక్స్‌ప్యాక్‌లు… జిమ్ బాడీలు… చూడ‌గానే ఆక‌ట్టుకునే శ‌రీర ఆకృతి… ఈ మ‌ధ్య కామ‌న్ అయిపోయింది లెండి. అయితే ఆ విషయానికి వ‌స్తే ఇవ‌న్నీ వృథాయేన‌ట‌. అదేనండీ, శృంగారం విష‌యానికి వ‌స్తే సిక్స్‌ప్యాక్ బాడీ వేస్టేన‌ట‌. బాన‌పొట్ట ఉన్న‌వారే అందులో కింగుల‌ట‌. ఇది మేం చెబుతున్న‌ది కాదు. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో తేలిన నిజం.

ట‌ర్కీలోని ఎర్సియెస్ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు కొంద‌రు 200 మంది పురుషుల‌పై స‌ర్వే చేశారు. వారిలో కొంద‌రు పైన చెప్పిన‌ట్టుగా సిక్స్‌ప్యాక్ బాడీల‌తో ఉండ‌గా, ఇంకొంద‌రు పొట్ట ఉన్న‌వారు. వారికి సంబంధించిన శృంగార విష‌యాల‌ను స‌ద‌రు సైంటిస్టులు స్ట‌డీ చేశారు. వారు ఎంత సేపు సెక్స్‌లో పాల్గొంటున్న‌ది, ఎంత స‌మ‌యం యాక్టివ్‌గా ఉంటున్న‌దీ అడిగి తెలుసుకున్నారు. వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ని కూడా లెక్కించారు. ఈ క్ర‌మంలో వారికి తెలిసిందేమిటంటే సిక్స్ ప్యాక్ బాడీలు ఉన్న‌వారు కేవ‌లం 2 నిమిషాల పాటు మాత్ర‌మే సెక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నార‌ని తెలిసింది. అదే పొట్ట ఉన్న‌వారు వారికి మూడు రెట్లు ఎక్కువ‌గా అంటే 7.3 నిమిషాల పాటు సెక్స్ చేస్తార‌ట‌. సైంటిస్టులు ఈ విష‌యాన్ని ఇటీవ‌లే వెల్ల‌డించారు.