కొద్ది రోజులు శృంగారంలో పాల్గొని మధ్యలో మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.?     2018-06-30   03:36:42  IST  Raghu V

చాలామంది పని ఒత్తిడిలో సెక్స్‌కు దూరమవుతున్నారు. మరికొందరు ఉద్యోగ, వ్యాపారాల నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల్లో గడపడం వల్ల సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఇంకొందరు సెక్స్ మీద ఆసక్తి లేక.. భాగస్వామికి దూరంగా ఉంటున్నారు. సెక్స్‌కు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.

ఏదైనా వస్తువును కొద్ది రోజులు వాడేసి.. ఆ తర్వాత వాడకుండా మూలకు పడేస్తే కొత్తదైనా సరే ఇబ్బందులు పెడుతుంది. అది అక్షర సత్యం. సెక్స్ జీవితంలోనూ అంతే. రస క్రీడలో పాల్గొనకుండా అలాగే ఉండిపోతే శరీరంలోని సెక్స్ ఆర్గాన్స్ పని చేయడం ఆగిపోతాయి అంట.

అంతేకాక సెక్స్ లో పాల్గొనేటప్పుడు సంతోషాన్నిచ్చే హార్మోన్లు అధిక శాతం ఉత్పత్తి అవుతాయి. కానీ అది ఆపేస్తే మాత్రం హార్మోన్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు హార్మోన్ల లోటుతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని పరిశోధకులు చెప్తున్నారు. హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు పరిశోధకులు తేల్చారు.

చివరగా.. సెక్స్ చేయకపోవడం వల్ల కలిగే ఒక్క మేలు.. మూత్రాశయ, సుఖ వ్యాధులు దూరంగా ఉండడం. అవును, సెక్స్ నుంచి దూరంగా ఉంటే సుఖ వ్యాధులు దరిచేరవు. అంతేగాకుండా.. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లూ మనవైపు తొంగి చూడవు. అదొక్క ప్రయోజనం మినహాయించి.. చాలా నష్టాలే ఎదురవుతాయన్నది శాస్త్రవేత్తల మాట.