శ్రీనివాస కళ్యాణం.. ఫైనల్‌ కలెక్షన్స్‌     2018-08-17   09:41:00  IST  Ramesh P

నితిన్‌ హీరోగా రాశిఖన్నా హీరోయిన్‌గా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. సినిమా కనీసం యావరేజ్‌గా అయినా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కాని అనూహ్యంగా సినిమా చెత్త టాక్‌ను దక్కించుకుంది. కనీసం పెళ్లి సీన్స్‌ కూడా ఆకట్టుకోలేక పోయాయి. సాగతీసినట్లుగా, బోరింగ్‌గా అనిపించిన సీన్స్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లుగా అనిపించాయి. సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయిన కారణంగా మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి. మూడవ రోజు నుండే పథనం ప్రారంభం అయ్యింది.

సినిమా మొదటి వారాంతంకు 9 కోట్ల వసూళ్లు సాధించింది. దాంతో మరో పది కోట్లను వసూళ్లు చేస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా సినిమాకు ఆ తర్వాత కేవలం రెండు కోట్లు మాత్రమే వచ్చాయి. తాజాగా గీత గోవిందం రావడంతో శ్రీనివాస కళ్యాణం థియేటర్లు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో షోలు క్యాన్సిల్‌ కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ఇంకా కొనసాగించడం కష్టం అంటూ తేలిపోయింది. అందుకే సగానికి పైగా థియేటర్ల నుండి ఇంకా ఆడిచ్చే ఛాన్స్‌ ఉన్నా కూడా తొలగించాలని నిర్ణయించారు.

Hero Nithin,Srinivasa Kalyanam,Srinivasa Kalyanam Final Collections,Srinivasa Kalyanam Movie Collections

శ్రీనివాస కళ్యాణం ఫైనల్‌ కలెక్షన్స్‌ ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 20 నుండి 25 థియేటర్లలో ఆడుతున్న కారణంగా మరో 25 లక్షల వరకు షేర్‌ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ చిత్రం 12 కోట్ల వద్ద క్లోజ్‌ అవుతుందని చెప్పుకోవచ్చు.

Hero Nithin,Srinivasa Kalyanam,Srinivasa Kalyanam Final Collections,Srinivasa Kalyanam Movie Collections

శ్రీనివాస కళ్యాణం టోటల్‌ కలెక్షన్స్‌ :
నైజాం- 4.7 కోట్లు
వైజాగ్- 1.3 కోట్లు
తూర్పు గోదావరి- 70 లక్షలు
పశ్చిమ గోదావరి- 57 లక్షలు
కృష్ణా- 60 లక్షలు
గుంటూరు- 75 లక్షలు
నెల్లూరు- 31 లక్షలు
సీడెడ్- 1.4 కోట్లు
ఇండియాలోని మిగతా ఏరియాల్లో- 72 లక్షలు
యుఎస్- 75 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్- 11.7 కోట్లు