ఇంతకు ఆ అకౌంట్‌ శ్రీరెడ్డిదేనా? కాదా?     2018-06-17   23:11:38  IST  Raghu V

గత కొంత కాలంగా శ్రీరెడ్డి టాలీవుడ్‌ పెద్దలపై చేస్తున్న వ్యాఖ్యలతో స్టార్‌ అయ్యింది. ఆమెను సోషల్‌ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షల్లో చేరింది. ఫేస్‌ బుక్‌లో అధికారిక ఖాతా కలిగి ఉన్న శ్రీరెడ్డి ట్విట్టర్‌లో తనకు ఖాతా లేదంటూ ఉంది. గత కొన్నాళ్లుగా ట్విట్టర్‌లో శ్రీరెడ్డి పేరు మీద ఉన్న ఒక ఖాతాలో ఆసక్తికర ట్వీట్స్‌ పడుతున్నాయి. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌, నానిలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ శ్రీరెడ్డి అకౌంట్‌ రన్‌ అవుతుంది. ఇటీవలే అమెరికా సెక్స్‌ రాకెట్‌ విషయమై టాలీవుడ్‌ అంతా షేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఆ విషయంపై కూడా శ్రీరెడ్డి స్పందన అంటూ ట్వీట్స్‌ రావడం చర్చనీయాంశం అయ్యింది.

ట్విట్టర్‌లో శ్రీరెడ్డి పేరుతో ఉన్న అకౌంట్‌లో గత కొన్ని రోజులుగా అభ్యంతరకర భాషల్లో ట్వీట్స్‌ వస్తున్నాయి. సినిమాల్లో అవకాశాలు లేని వారు అమెరికా చెక్కేసి అక్కడ షోలు చేస్తున్నారు. ఇన్నాళ్లు వారు అక్కడ షోలు చేస్తున్నారు అంటే ఏంటో అనుకున్నాం, కాని వారు చేస్తున్న షోలు ఇవి అని తెలిసి షాక్‌ అవుతున్నాను అంటూ శ్రీరెడ్డి అకౌంట్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. మొత్తానికి శ్రీరెడ్డి పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌ సినీ వర్గాల్లో చర్చ నీయాంశం అవుతున్న సమయంలోనే మరో సంచలన ట్వీట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.