సీఎం గారు నన్ను అలా చేయకండి .. శ్రీ రెడ్డి ట్విట్  

ఎదో ఒక సంచలన వార్తతో ఎప్పుడూ మీడియా లో హాట్ టాపిక్ గా మారుతున్న నటి శ్రీ రెడ్డి కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదిక గా చేసుకుని అనేక సంచలనాలకు తెర లేపుతోంది. ఆమె నుంచి ఎప్పుడు ఏ ట్విట్ వస్తుందో అన్న ఆందోళన, ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. కొద్ది రోజుల క్రితం శ్రీ రెడ్డి తరహాలోనే వివాదాలు సృష్టిస్తున్న కత్తి మహేష్ కి నగర బహిష్కరణ విధించారు పోలీసులు. స్వామి పరిపూర్ణానంద పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి కేసీఆర్ కి ఓ ట్విట్ పెట్టింది. నగరం నుంచి తనను బహిష్కరించొద్దని అభ్యర్థించింది.

అంతే కాదు సినీ పరిశ్రమలో అమ్మాయిలను వాడుకున్న వారిలో నటులే కాదు.. రాజకీయ నేతలు కూడా ఉన్నారంటూ శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌‌కి తన ఫేస్‌బుక్‌ ద్వారా గతకొన్నిరోజులుగా శ్రీరెడ్డి విన్నవిస్తోనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి శ్రీరెడ్డి తనను హైదరాబాద్ నుంచి బహిష్కరించవద్దంటూ సీఎంను అభ్యర్థిస్తోంది.

‘‘గౌరవనీయులైన సీఎం కేసీఆర్ సార్.. దయచేసి నా అభ్యర్థనపై స్పందించండి సార్.. ఎన్నిరోజులు మేము ఇలా బాధలు పడాలి. డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లతో పడుకునే వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ.. వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేరుగా తేనేటీగల గూడును తాకలేను. ఎందుకంటే… ఒకవేళ ఆ రాజకీయ నాయకుల గురించి మాట్లాడినా… నాకు న్యాయం జరగదని బాగా తెలుసు. ఆ నేతలు నన్ను చంపినా చంపేయచ్చు సార్.. నేను సురక్షితంగా కూడా ఉండలేను. మిమ్మల్ని చేరడం చాలా కష్టం. డ్రగ్స్, సెక్స్‌ రాకెట్‌లో మీ సన్నిహితులు కూడా ఉన్నారు. నేను పొలిటికల్ సైడ్‌ రాదలచుకోలేదు. అందుకే మౌనంగా ఉన్నాను’’

‘‘కానీ.. ప్లీజ్ సార్.. ‘మా’ అసోషియేషన్, సినీ పరిశ్రమలోని పెద్ద తలలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరో తండ్రిగానూ.. తెలంగాణ రాష్ట్రానికి మీరు కింగ్. నావైపు పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. మీరు నా బాధను అర్థం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించి నాకు న్యాయం చేయండి. వారిని ఉపక్షేంచొద్దు.. వేలాది మంది బాధితుల రోదన. దయచేసి ఈ పోస్టు సీఎం సర్‌ను చేరుతుందని ఆశిస్తున్నా. హైదరాబాద్‌ నుంచి నన్ను బహిష్కరించ వద్దండి. నేను చెప్పేవన్నీ వాస్తవాలు’’ అని శ్రీరెడ్డి బయటపెట్టింది.