హలో శ్రీరెడ్డి.. నాని సంగతేమైంది?     2018-05-11   02:20:29  IST  Raghu V

శ్రీరెడ్డి ఈ పేరు ఈమద్య తెలుగు సినిమా పరిశ్రమలో మరియు మీడియాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈమె ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యింది. సినిమాల్లో నటించకుండానే ఈమెను అందరు గుర్తించేలా పేరు తెచ్చుకుంది. శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌పై ఉద్యమం ప్రారంభించి శేఖర్‌ కమ్ముల, నాని, వైవాహర్ష, అభిరామ్‌, శ్రీరామ చంద్రలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అందరి దృష్టి ఈమెపై పడటం జరిగింది. అయితే ఈమె ఏ పని చేసినా ఆరంభ సూరత్వం అన్నట్లుగానే ఉంది. ప్రతి విషయం కూడా ప్రకటిస్తూ ఉంది, రెండు మూడు రోజులు హడావుడి చేసి మళ్లీ కామ్‌ అవుతుంది. మళ్లీ కొత్త విషయంతో మీడియా ముందుకు వచ్చింది.

ఆ మద్య కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ఉద్యమం చేసిన శ్రీరెడ్డి, ఆ తర్వాత అభిరామ్‌ విషయంలో తనకు న్యాయం చేయాలని వ్యక్తిగత పోరాటం చేసింది. ఆ తర్వాత పవన్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి, ఆ వ్యాఖ్యలకు సారీ కూడా చెప్పింది. అటు పిమ్మట రాజకీయ పార్టీలపై విమర్శలు చేసింది. ఇంకా పలు విషయాలపై ఈమె స్పందిస్తూ, తన వాదన వినిపిస్తూ వచ్చింది. కాని ఒక్క విషయంలో కూడా ఈమె నిలకడగా వ్యవహరించడం లేదు. ఇటీవలే ఈమె నానిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయికి రోజంతా కూడా నరకం చూపించిన నీకు త్వరలోనే చుక్కలు చూపిస్తాను అంటూ హెచ్చరించింది.