రాజ‌కీయాల్లోకి శ్రీరెడ్డి ? అదిరిపోతున్న ట్వీట్‌..!!  

క్యాస్టింగ్ కౌచ్‌- అంటూ సినీ రంగాన్ని కుదిపేస్తున్న శ్రీరెడ్డి చుట్టూ ఇప్పుడు మీడియా ఆస‌క్తిగా ప్ర‌దక్షిణ‌లు చేస్తోంది. ఆమె ఏం చెప్పినా హాట్ న్యూస్ అయిపోతోంది. ఆమె ఎలాంటి ట్వీట్ చేసినా సంచ‌ల‌నంగా మారుతోంది. గ‌త 15 రోజులుగా శ్రీరెడ్డి చుట్టూ తెలుగు మీడియా తిరుగుతూనే ఉంది. అదేవిధంగా టాలీవుడ్ సైతం శ్రీరెడ్డి కేంద్రంగా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం తీవ్ర వివాదంలో కూరుకుపోయారు. రాజ‌కీయంగా కూడా శ్రీరెడ్డి తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది. ఆమె వెనుక ఎవ‌రో ఉండిత‌న త‌ల్లిని తిట్టించారంటూ.. ప‌వ‌న్ చేసిన హ‌డావుడి ఇప్ప‌ట్లో తెర‌మ‌రుగ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.

అంతేకాదు, ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ కేంద్రంగా ఈ వివాదం యూట‌ర్న్ తీసుకుంది. దీంతో ఇప్పుడు శ్రీరెడ్డి తెర‌మీదికి తెచ్చిన క్యాస్టింగ్ కౌచ్‌.. స‌మ‌స్య తెర‌మ‌రుగై..ప‌వ‌న్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఇలా శ్రీరెడ్డి వివాదం కాసింత ప‌క్క‌కు వెళ్లింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలోనే ఆమె మ‌రో వివాదాన్ని తీసుకొచ్చారు. అదికూడా విప‌క్ష నేత జ‌గ‌న్ రూపంలో ఆమె తేనెతుట్టె కుదిపారు. ఏపీలో రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసేలా శ్రీరెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది రాజ‌కీయంగా పెను సంచ‌ల‌నం సృష్టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించింది శ్రీరెడ్డి.