శ్రీరెడ్డిలో కొత్త యాంగిల్‌, రానాపై..!     2018-06-21   04:15:07  IST  Raghu V

కొన్ని నెలల ముందు వరకు శ్రీరెడ్డి అంటే సినిమా ఇండస్ట్రీలో వారికి కూడా పెద్దగా తెలియదు. కాని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారితో పాటు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా శ్రీరెడ్డి ఎవరు ఏంటీ అనే విషయం తెలిసింది. జాతీయ మీడియాలో కూడా ఈమె గురించి వార్త కథనాలు రావడంతో పబ్లిక్‌ ఫిగర్‌ అయ్యింది. హీరోయిన్‌కు ఉన్న గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు సినిమాలు చేయకున్నా కూడా సోషల్‌ మీడియాతో తెగ పాపులర్‌ అవుతుంది. మొన్నటి వరకు ప్రతి రోజు పది టీవీ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపిన ఈమె ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా పంచ్‌ల వర్షం కురిపిస్తుంది.

మొన్నటి వరకు ప్రతి హీరోపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శ్రీరెడ్డి తాజాగా తన గొంతును కాస్త సవరించుకున్నట్లుగా అనిపిస్తుంది. శ్రీరెడ్డి ఇటీవల నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆయనపై ఏ ఆడది చేయని, చేయకూడని విమర్శలు చేసి సంచలనం సృష్టించింది. నాని నాతో పడుకున్నాడు అని, నాతో దారుణంగా వ్యవహరించాడు అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు నాని కెరీర్‌ను కూడా ప్రభావం చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. గత కొన్ని రోజులుగా నానిపై వ్యాఖ్యలను కాస్త తగ్గించింది. ఈమె చేసిన ఆరోపణలు మరియు విమర్శల విషయంలో నాని లీగల్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.