అలా జరగదు.. జరిగితే రచ్చ రచ్చే     2018-06-02   00:05:24  IST  Raghu V

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఈనెల 10న లాంచనంగా ప్రారంభం కాబోతుంది. నాని హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యాయి. ప్రోమోలు షోపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడంతో సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయ్యింది. గత సీజన్‌లో కేవలం 70 రోజు మాత్రమే షో కొనసాగింది. కాని ఈసారి మరో నెల రోజులు పెంచి ఏకంగా 100 రోజులు కొనసాగించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పటికే బిగ్‌బాస్‌ ఇల్లు సెట్టింగ్‌ పూర్తి అయ్యింది. ఇక ఈ షోలో కనిపించబోతున్న సెబ్రెటీలు ఎవరా అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఎంతో మంది పేర్లు పరిశీలించారు. ఎంతో మంది పేర్లు మీడియాలో ప్రచారంకు వస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శ్రీరెడ్డి. ఈమె గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఫైర్‌ బ్రాండ్‌గా మారిపోయింది. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఈమె మొదలు పెట్టిన ఉద్యమం అనేక మలుపులు తీసుకుని, చివరకు ఆమె నాశనంకు దారి తీసింది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈమెను బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. శ్రీరెడ్డి బిగ్‌బాస్‌ ఎంట్రీపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వస్తున్నవన్ని కూడా పుకార్లే అని, ఖచ్చితంగా శ్రీరెడ్డి బిగ్‌బాస్‌లో ఉండదు అంటూ చెబుతున్నారు.